ఎర్రవల్లి మండల కేంద్రానికి PHC ఏర్పాటు చేయాలనీ వినతి
జోగులాంబ గద్వాల 17 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండలం ఏర్పడి సుమారు 4 సంవత్సరాలు ఐన నేటికీ PHC ఏర్పాటు కాలేదని నూతన సర్పంచ్ అనిత . కృష్ణ సాగర్ DMHO ఆఫీస్ నందు, జిల్లా వైద్య పోగ్రామ్ అధికారి డాక్టర్ అస్ఘర్ అలీ కీ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..... మండలంలోని ప్రజలందరికీ పీహెచ్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు అధికారులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణసాగర్ దశరథం సాగర్ రాజేష్ లు పాల్గొన్నారు.