అంగనవాడి సెంటర్లోలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు 

Sep 4, 2026 - 19:36
Sep 4, 2026 - 21:10
 0  39

జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్తా ప్రతినిధి : మండల లోని చాగాపురం రెండవ అంగన్వాడి సెంటర్ నందు  గురువారం కృష్ణాష్టమి వేడుకలను అంగన్వాడి కేంద్రంలో నిర్వహించారు.చిన్నారులనుబాలకృష్ణుని,రాధాదేవి వేషధారణ  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్లో పండుగ వాతావరణం నెలకొనగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మాట్లాడుతూ ఇటువంటి పండుగలు,సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు పరిచయడం చేయడంతో వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి అన్నారు. చిన్నారులను శ్రీకృష్ణుడు, రాధా, గోపికల వేషధారణ చేసిన అంగన్వాడి  టీచర్ ను చిన్నారుల తల్లిదండ్రులు అభినందించారు. 
 ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ భాగ్యమ్మఆయా కృష్ణవేణి తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State