బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు సంఘీభావం తెలిపి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని - జిల్లా కలెక్టర్ ను కోరిన
బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు సంఘీభావం తెలిపి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని - జిల్లా కలెక్టర్ ను కోరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.కృష్ణమోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. అలంపూర్. నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల నుండి దాదాపు 20 కిలోమీటర్ల మేర గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటున్న విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల.కృష్ణమోహన్ రెడ్డి * వ్యక్తిగత పనుల మీద పెబ్బేరు కు వెళుతున్న సందర్భంలో వీరాపురం గ్రామం దగ్గర విద్యార్థుల పాదయాత్ర దగ్గరకు చేరుకొని విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వెంటనే *జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ కుమార్ .కు ఫోన్ లో మాట్లాడుతూ.... విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పాఠశాల ప్రిన్సిపల్ పై చర్య తీసుకొని బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే వెంటనే ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.