మేము మారం.... మాకు కావలసింది కాసులే 

Apr 24, 2025 - 18:40
 0  6
మేము మారం....  మాకు కావలసింది కాసులే 

ఎసిబికి పట్టుపడుతున్న ప్రభుత్వ శాఖలో ఆగని అవినీతి 

సోమవారం ఒకే రోజు సీఐ తో పాటు ఆర్ఐ, రిపోర్టర్ ఏసిబి వల లో 

ప్రభుత్వ అధికారులు ఉంటే ప్రజా సేవకులు అని మన మహాత్మా గాంధీ పలు సందర్భంలో వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్ కదిలాలంటే కాసులు గుమ్మడించాల్సిన పరిస్థితి ప్రజలకు నెలకొంది. ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని సాగుతున్న అవినీతిని అడ్డుకట్ట వేయడానికి ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో దాడులు నిర్వహించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను జై లకు పంపుతున్నప్పటికీ ప్రతి కార్యాలయంలో అవినీతి మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారుగా 100 మందికి పైగా లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. వీరిలో ఈ శాఖ ఆశాక అనే తేడా లేకుండా అన్ని శాఖల అధికారులు ఏసీబీ వల్లలో చిక్కారు. ఫిబ్రవరి మాసంలోనే 25 మందికి పైగా కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి ఎంతవరకు  పేరుకపోయిందో తేటతెల్లమవుతుంది. తాజాగా సోమవారం జనగామ జిల్లా లో చిల్పురు తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినీత్ కుమార్ ఓ రైతు నుంచి 26వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. పద్ధతి కొత్తగూడెం జిల్లా లో పనిచేస్తున్న సిఐ సతీష్, ఓ రిపోర్టర్ గోపి మధ్యవర్తిగా చేసుకుని లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వ శాఖలో ప్రతిరోజు ఏదో ఒకచోట అవినీతికి పాల్పడుతూ ఏసీబీ వలలో చిక్కుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి మాత్రం ఏ మాత్రం ఆగకుండా దర్జాగా కొనసాగుతుంది . తాము మారం.. తమకు కావలసింది కాసులే అంటూ కొంతమంది అధికారులు అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు పక్కకు వేసుకోవాలన్న ఆశతో ప్రజలను పీడించుకుంటూ లంచాలకు ఎగబడుతున్నారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆగని అవినీతి 

ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి ఆగడం లేదు. ప్రతి శాఖలో కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం అంటే దేవాలయాలకు అని ప్రజలు నమ్ముతారు. అధికారులను దేవుళ్ళతో సమానంగా చూస్తుంటారు. అలాంటివారే పనుల నిమిత్తం ం ప్రభుత్వ కార్యాలకు వస్తే లంచం ఇవ్వండి ఫైళ్లు కదలడం లేదు. గ్రామ కార్యదర్శులు మొదలుకొని ఉన్నత అధికారుల వరకు అవినీతికి చోటు కల్పిస్తున్నారు. ప్రాంతంలో ఎక్కువగా ఇసుక మాఫియా, మొరం మాఫియా, డాబాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, విచ్చలవిడిగా పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి. వీటినుంచి సంబంధిత శాఖ అధికారులకు పెద్ద ఎత్తున నెల నెల పెద్ద ముడుపులు అందుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఓ సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్న అధికారికి ఇసుక మాఫియా నుంచి పెద్ద ఎత్తుల బుడుపులు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈ అధికారికి ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో ఆ అధికారి విచ్చలవిడిగా అవినీతికి చోటు కల్పిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి . ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333