సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలి

Jul 3, 2024 - 22:26
 0  28
సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలి
సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలి

సైబర్ మోసం జరిగిన  వెంటనే  1930 కి కాల్ చేసి ,NCRP portal (www.cybercrime.gov.inలో ఫిర్యాదు  చేయండి 
----- సైబర్ సెక్యూరిటీ వింగ్ ఇన్స్పెక్టర్ రాజు

జోగులాంబ గద్వాల 3 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సాంకేతిక పరిజ్ఞానం తో కొత్త కొత్త మార్గాలలో జరుగుతున్న  సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త గా ఉండాలని, డబ్బులు పోయాక బాధపడటం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని సైబర్ సెక్యూరిటీ విభాగం  ఇన్స్పెక్టర్  రాజు   ప్రజలకు  సూచించారు.

బుదవారం జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు IPS  ఆదేశాల మేరకు  సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ బ్యూరో అధ్వర్యంలో ఐజ పట్టణంలో ప్రజలకు    సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై  సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ రాజు, ఐ జ ఎస్సై విజయ్ భాస్కర్  సైబర్ నేరాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త పై   అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ -----  కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డబ్బుల పోయాక బాధపడటం కంటే అవగాహనా తో వ్యవహరించి జాగ్రత్త గా ఉండాలని అన్నారు. ముఖ్యంగా బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి OTP వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని ,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని గ్రహించాలని, ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి అని అన్నారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం ఏదైనా ప్రభుత్వ శాఖ వారు ఫోన్ చేసి OTP వివరాలు అడుగరనే విషయన్ని గ్రహించాలని అన్నారు. 

ప్రజలు ,గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి sms, emails ద్వారా గాని,whatsap,twitter ద్వారా వచ్చే blue కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దు, చిన్న చిన్న తప్పిదాలతో తాము కష్ట పడి సంపాదించిన  డబ్బును పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా IPL , ఇతర  క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా యువత IPL డ్రీమ్ లేవెన్ అప్లికేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టీ రెండు టీమ్ లలో బెస్ట్ ఒక టీమ్ను సెలెక్ట్ చేసుకుంటారని వారు ఆడే ర్యాంకు ను బట్టీ తద్వారా పెట్టిన అమౌంట్ కు అదనంగా డబ్బుల వస్తుoటాయాని  ఆ క్రమం లో  సైబర్ నేరగాళ్లు అప్లికేషన్ లు పంపించి మేము మంచి టీం ను సెలక్ట్ చేస్తాము అని చెప్పి మన యూజర్ ఐడీ అడుగుతారని  అవి మనం ఆశకు పోయి ఇచ్చినట్లు అయితే  పలితంగా మన డేటా వాళ్ళకు వెళ్లిపోవడం వాళ్ల డబ్బులు కోల్పోవడం జరుగుతుందని , మరో విధంగా FEDEX కొరియర్ పేరుతో మన ఫోన్ లకు కాల్ చేసి పోలీసులము అంటూ మీరు పెట్టిన ఆర్దర్ లో డ్రగ్స్ వచ్చాయని కావున మిమ్ములను అరెస్ట్ చేస్తామని లేడంటే డబ్బులు వేయాలని బెదిరిస్తారని ఎవరూ కూడా డబ్బులు వేయకుండా లోకల్ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆన్లైన్ లో తక్కువ రేటుకు విలువైన వస్తువులు వస్థయంటే నమ్మి సైబర్ నేరాలకు గురి కావద్దని,అలాగే మిసో లో ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల మీకు కొన్ని లక్షల లాటరీ తాకిందని అవి పంపడానికి కొత్త రిజిస్టర్ ఫీ అంటూ సైబర్ మోసగాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తారని అట్టి వాటి పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన  వెంటనే స్పందించి 1930 కి సమాచారం అందించి NCRP portal (www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది రమేష్ తదితరులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333