సద్దల (చౌదరి) చెరువు ప్రాంతం లో నిర్వహిస్తున్న సర్వే అపాలని ధర్నా 

Sep 27, 2024 - 18:24
 0  34

సూర్యాపేట సెప్టెంబర్ 27 చౌదరి చెరువు పరిసర ప్రాంతం లో నివసిస్తున్న వారి గృహల ప్రాంతం లో హడ్రా పేరుతొ అధికారులు నిర్వహిస్తున్న సర్వే ను వెంటనే  ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేస్తూ 30,42,43 వార్డ్ ప్రజలు శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ ముందు  బిజెపి మున్సిపల్ ప్లోర్ లీడర్ పలస మహాలక్ష్మిమల్సుర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా  నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత యాభై సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకోని గృహాలు నిర్మించుకున్నామని అలాంటి ప్రాంతం లో ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ భూములు అంటూ రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అదికారులు సర్వే చేయడం సరికాదన్నారు. అధికారుల సర్వే తో ప్రజలు భయబ్రాంతులకు గురై తీవ్ర మనోవేదన కూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుంటే సుమారు 2000 కుటుంబాలు వీధినా పడుతాయిన్నారు.అధికారులు నిర్వహించే సర్వే ను వెంటనే నిలిపివేసి ఆందోళనకూ గురవుతున్న వారిలో మనోదర్యము నింపాలని కోరారు. 2022 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ ని సవరిస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి కొత్త మాస్టర్ ప్లాన్ ని రూపొందించడం జరిగింది. ఇట్టి కాపీని గవర్నమెంట్ కి పంపడం జరిగింది. 30 వార్డు కౌన్సిలర్ , బిజెపి ఫ్లోర్ లీడర్ పలస మహాలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్, అంగిరేకుల నాగార్జున, చెంచల నరేష్, బత్తుల రమేష్, బత్తుల బాబు, సట్టు శంకర్, గిరగాని లింగయ్య, మీర్ అక్బర్ తో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యలయంలో వినతి పత్రం అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333