ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు దుర్మార్గం
*ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు దుర్మార్గం*
*ప్రజా పాలన అంటే ఇదేన*
*సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి దావూద్*
ఏటూరునాగారం తెలంగాణ వార్త ఫిబ్రవరి 23 :- ఆశ వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని. హెల్త్ కార్డులు. ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమైన డిమాండ్లు ఇవేకాక అనేక హామీలు ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వ పెద్దల్ని అరెస్ట్ చేయాలని దావూద్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు చేయమని అనేక ప్రయత్నాలు చేసి అమలు గాని పక్షంలోనే కదా శాంతియుతంగా. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేసేది. అలాంటి సందర్భం లో ముందస్తు అరెస్టులు. ఏ బూర్జువ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఈ విధంగానే పోలీసులను పావులుగా వాడుకొని అక్రమ అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యమా. రాచరిక వ్యవస్థన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలనే కదా! అడిగేది న్యాయమైన కోరికలే కదా! గొంతెమ్మ కోరికలు ఏమి కాదు కదా! అలాంటప్పుడు దమ్మున్న ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలను అమలు చేయాలి తప్ప మహిళలని కూడా చూడకుండా ఇండ్లల్లకు వెళ్లి వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తీసుకురావడం ఎంత దుర్మార్గపు చర్యనో ఒక్కసారి అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికాడు.
ఈ రోజున ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం దృష్టికి ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని ఎంతో వ్యాయా ప్రయోసాలకు ఓర్చి బయలుదేరితే ఎక్కడికక్కడే అరెస్టులు చేసి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఒక రబ్బరు బంతిని ఎంత గట్టిగా భూమికి వేసి కొడితే అంత ఎత్తుకు లేస్తుందని కార్మికుల్ని. కర్షకుల్ని రెచ్చగొడితే హామీలు అమలు అయ్యేవరకు ఎంతటి నిర్బంధానైనా తట్టుకొని పోరాటాలు ఉద్ధృతం చేస్తారని వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పనిచేయాలని ఇప్పటికైనా సమస్యల పైన చర్చలు జరిపి ఆశలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని దావూద్ డిమాండ్ చేశారు.