బాలికల బాధ పటదా!???... స్టడీ అవర్స్ తర్వాత

Oct 18, 2024 - 11:59
Oct 18, 2024 - 16:31
 0  63
బాలికల బాధ పటదా!???... స్టడీ అవర్స్ తర్వాత

తెలంగాణ వార్త ప్రతినిధి:* కాలకృత్యాలకూ కష్టమే*

October 18, 2024 12:45 am

Time మంది:s are also difficult– సగటున 600 మంది విద్యార్థులకు 20 మరుగుదొడ్లు

– ఏడుగురికొకటి ఉండాల్సి ఉండగా 30 మందికొకటి

– ఉదయం నాలుగున్నర నుంచే క్యూ

– ఐదు గంటల నుంచి స్నానాల కోసం లైన్‌

– అయినా సమయానికి స్కూల్‌కు వెళ్లడం కష్టమే

– మిగతా టైం టేబుల్‌పైనా ప్రభావం

– యోగా క్లాసులు, వ్యాయామాలకు వెళ్లలేని దుస్థితి

– మానసిక ఒత్తిడిలో పిల్లలు

– ఇదీ మన గురుకులాల పరిస్థితి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కుటుంబంలో నలుగురు సభ్యులుంటేనే స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇంట్లో బాత్‌రూమ్‌ దగ్గర కోపగించుకోవడాలు, అరుచుకోవడాలు సాధారణంగా కనిపిస్తుంది. మరి 30 మంది విద్యార్థులకు సగటున ఒక్క మరుగుదొడ్డి ఉంటే పరిస్థితేంటి? వారి అరిగోస చెప్పలేనిది. ఈ క్షోభను గురుకుల పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు అనుభవిస్తున్నారు. అందరూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. స్నానాలు చేయాల్సిందే. రెడీ కావాల్సిందే. ఆదరాబాదరగా బడికి పోవాల్సిందే. ఒక్కో విద్యార్థి కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి కనీసం పది నిమిషాల టైమ్‌ వేసుకున్నా 30 మందివి పూర్తి కావాలంటే ఐదు గంటలు పడుతుంది. స్కూల్‌కు వెళ్లడానికి ఎక్కడ లేట్‌ అవుతుందో.. ఉపాధ్యాయులు ఎక్కడ మందలిస్తారో అన్న భయంతో చిన్నారులు ఉదయం నాలుగు గంటలకే లేచి మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌ల ముందు క్యూకడుతున్నారు. అయినా, స్కూల్‌కు టైమ్‌కు చేరుకోలేక టీచర్ల నుంచి తిట్లు పడుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొందరు స్నానాలు చేయకుండా క్లాసులకు పరుగెడుతున్నారు. మరికొందరు టిఫిస్లు చేయకుండానే నేరుగా క్లాసుకెళ్లిపోతున్నారు. అర్ధాకలితో కడుపులో పేగులు పరుగెడుతుంటే ఆకలి బాధతో టీచర్లు చెప్పే క్లాసులపై దృష్టి సారించలేక గోస దీస్తున్నారు. చూడటానికి ఇది మామూలుగా సమస్యగానే కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో రుగ్మతలకు దారితీసే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

టైం టేబుల్‌ కష్టాలు..

రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యా సంస్థల్లో కామన్‌ టైంటేబుల్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు కష్టాలొచ్చిపడ్డాయి. 33 జిల్లాల్లో 1022 గురుకుల విద్యా సంస్థల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సరాసరి 600 మంది విద్యార్థులున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలో 20 మరుగుదొడ్లు, 20 స్నానపుగదులు మాత్రమే ఉన్నాయి. అరకొర వసతులతో కొనసాగుతున్న ఆ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన టైంటేబుల్‌ పాటించటం కష్టంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండానే అన్ని గురుకులాలకు ఒకేరకమైన పని వేళలను సర్కారు నిర్ణయించింది. ఎడతెరిపి లేకుండా కొనసాగే ఈ టైంటేబుల్‌ వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చాలీచాలని మరుగుదొడ్లు, బాత్‌రూంలలో కేవలం అరగంటలో స్కూల్‌, జూనియర్‌ కాలేజీకి చెందిన 640 మంది, డిగ్రీ కాలేజీలో చదివే 840 మంది విద్యార్థులు ఎలా కాలకృత్యాలను తీర్చుకోగలరు? ఎలా తయారవగలరు? అనేది టైంటేబుల్‌ను రూపొందించిన పెద్దలే చెప్పాలి. ఇక భవనాల అద్దెలను చెల్లించలేదనే సాకుతో యాజమాన్యాలు వసతులు కల్పించడం మానేశాయి.

బాలికల బాధ పట్టదా?

ఏకబిగిన ఉదయం ఐదు గంటలకు లేచిన విద్యార్థి, విద్యార్థినులు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉరుకులు పరుగులతో చదువు సాగిస్తున్నారు. మానసిక ఒత్తిడితో అలిసిపోతున్నారు. గురుకులాల్లో బాలికలకు 75శాతం మందికి నెలసరి క్రమం ఉంటుంది. ఆ సమయంలో వారి వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం చాలా అవసరం. కానీ.. వసతుల లేమి, సమయం సరిపోక పోవటంతో చెప్పుకోలేని వేదనకు గురవుతున్నారని కొందరు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మానసిక సమస్యలతో పాటు చర్మ సంబంధ వ్యాదులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

మానసిక రుగ్మతలు పెరిగితే ప్రమాదం

విద్యార్థుల్లో మానసిక రుగ్మతలు పెరిగితే సమాజానికి తీవ్ర నష్టం. వారి మానసిక వికాసానికి దోహద పడే విధంగా పరిసరాల ప్రభావం ఉండాలి. మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం, శారీరక వ్యాయామ లోపం వివిధ మానసిక రుగ్మతలకు దారితీస్తాయి. బాధ్యతగా విద్యార్థులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. సరిపోను నిద్ర, ఆకలిలేమి, యోగా, వ్యాయామ, మెడిటేషన్‌, తగిన విధంగా ఆటలు ఉన్నప్పుడే వారిలో మానసిక వికాసం పెంపొందుతుంది.

ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశాల్‌ ఆకుల, న్యూరో సైక్రియాట్రిస్ట్‌

ఇదీ అసంబద్ధ సమయ పాలన..

– ఉదయం 7.00నుంచి 7.45 వరకు అల్పాహారం

– మధ్యాహ్నం 12.45 నుంచి1.25 వరకు భోజన విరామం

– సాయంత్రం 4.30నుంచి 4.45 వరకు స్నాక్స్‌

– సాయంత్రం 5.45 నుంచి 6.00(15 నిముషాలు) విద్యార్థుల హాజరు.

– సాయంత్రం 6.00 నుంచి 6.15 వరకు విద్యార్థుల వ్యక్తిగత కార్యక్రమాలు

అంటే.. ఆటలు ఆడిన విద్యార్థులకు ఈ 15 నిముషాల్లో స్నానం, బట్టలు ఉతుక్కోవటం,తదితర పనులకు సమయం కేటాయించారన్న మాట. ఆ తర్వాత వెంటనే 6.15 నుంచి 7.00వరకు డిన్నర్‌ చేయాలి. దీంతో స్టడీ అవర్స్‌ తర్వాత ఆకలవుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State