రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఆదానికి మించిన ఆస్తుల కేసులో భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
భూపాల్ రెడ్డికి సంబంధించిన ఐదు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో.. 40 కోట్ల రూపాయల వరకు అక్రమాసులను గుర్తించింది ఏసీబీ.. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
గతంలోనూ భూపాల్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ల్యాండ్ వ్యవహారంలో అధికారులకు దొరికిపోయాడు. పెద్ద ఎత్తున నగదు, ఆస్తి పత్రాలను అధికారులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.