జోన పౌండేషన్ సేవలు అభినందనీయం

అన్నదానంతో కక్షిదారుల ఆకలి తీర్చడం హర్షనీయం

Mar 9, 2025 - 13:00
Mar 9, 2025 - 13:05
 0  7
జోన పౌండేషన్ సేవలు అభినందనీయం

జోన పౌండేషన్ ఆధ్వర్యంలో కోర్టు సముదాయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యాయమూర్తులు.

సూర్యాపేట, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టుల ఆవరణలో నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో జోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమయాన్ని ఆదా చేశారని పలువురు న్యాయమూర్తులు అన్నారు. సూర్యాపేట జిల్లా కోర్టుల భవనంలో నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో జోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్ లో తమ కేసులను పరిష్కరించుకునేందుకు రాష్ట్రంలోని ఎక్కడెక్కడ నుంచో కక్షేదారులు వస్తుంటారని వారి సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కక్షిదారులు కేసుల పరిష్కార సమయంలో భోజనం కోసం వెళ్లి సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టుల ల భవనంలోనే భోజనాన్ని ఏర్పాటు చేసిన జోన ఫౌండేషన్ నిర్వాహకులు గండూరి ప్రవళిక ప్రకాష్ ను అభినందించారు. సమాజంలో జోన పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్యాం శ్రీ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్విన్ కౌసర్, జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నూకల సుదర్శన్ రెడ్డి డప్పుకు మల్లయ్య, సత్యనారాయణ పిల్లె, నాయిని రామ్ మనోహర్ రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, యాతాకుల రాజయ్య ఎర్ర వీరస్వామి చింత వినయ్ బాబు, బొడ్డు విజయ్, వల్దాస్ జానీ (జే) తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333