సాంస్కృతిక యోధునికి ఘన నివాళి

Apr 10, 2024 - 19:31
Apr 10, 2024 - 19:41
 0  10
సాంస్కృతిక యోధునికి ఘన  నివాళి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- ఏపూర్ లో సాంస్కృతిక యోధునికి ఘన నివాళి అరుణోదయ వ్యవస్థాపకులు విప్లవ సాంస్కృతిక యోధుడు తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచి ఉద్యమ బాట నడిపించి ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప గొప్ప కళాకారులను తయారుచేసి అరుణోదయ సంస్థకు అందించిన కళ తపస్వి కవి గాయకుడు రచయిత కామ్రేడ్ కానూరి తాతగారి 9వ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలో ఏపూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కాంచనపల్లి సైదులు అరుణోదయ జిల్లా నాయకులు బోల్క పవన్ న్యూ డెమోక్రసీపార్టీ డివిజన్ నాయకులు జిలేరు వీరబోయిన ఎర్రయ్య బోల్క బిక్షం PYL గంగరబోయిన రమేష్ దడిగల లింగయ్య కుంట రవి బొంత గోపాల్ కార్యంగుల వెంకన్న వీరబోయ నాగయ్య PDSU మాజీ జిల్లా నాయకులునాయకులు కేశబోయిన వంశీ తదితరులు పాల్గొన్నారు