సమానత్వం, సమాజహితమే MRPS ఉద్యమ గమ్యం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సమానత్వం, సమాజహితమే MRPS ఉద్యమ గమ్యం 30 ఏళ్లుగా MRPS ఉద్యమానికి అండగా నిలిచిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం దృడ సంకల్పంతో పోరాడుదా ఆత్మకూరు ఎస్ :గత 30ఏళ్లుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రాజన్న మాదిగ అన్నారు MRPS 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అద్యక్షతన జరిగిన ఆవిర్భావం మరియు మంద కృష్ణ మాదిగ గారి పుట్టిన రోజు వేడుకల్లో ఈ సందర్బంగా MRPS జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎం ఎస్ వి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాట్లాడుతూ పాలకుల కుట్రలను చేదిస్తు, ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమని అన్నారు. 76యేండ్ల స్వతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు. ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎమ్మార్పీఎస్ అందించిందని అన్నారు. అలాగే మానవతా దృక్పథంతో గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, హత్యలకు అత్యాచారాలకు గురైన మహిళల కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం MRPS పోరాటం చేస్తుందని అన్నారు. మాదిగల కోసమే పోరాటం ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. సమాజంలో నెలకొని ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి సాంఘిక సమానత్వం సాధించడమే MRPS ఉద్యమ గమ్యమని, సమాజహితం కోసం పునరంకితం అవుతామని అన్నారు . 30 ఏళ్లుగా MRPS ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న మాదిగ ప్రజలకు , ఉద్యమానికి అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్న ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నియోజవర్గం ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ ఆత్మకూర్ ఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ తిప్పర్తి బిక్షం మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తిప్పర్తి గంగరాజు మాదిగ ములకలపల్లి కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధికారి ప్రతినిధి మిర్యాల చిన్ని మాదిగ ఇరుగు మధు మాదిగ తిప్పర్తి రాంబాబు బొడ్డు నవీన్ బొడ్డు సందీప్ బొడ్డు ప్రశాంత్ మాదిగ పవన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు