ధర్మారం గ్రామం నుండి యదేచ్ఛగా చెరువు మట్టి తరలిస్తున్న అక్రమార్కులను ఆపలేరా..చోద్యం చూస్తున్న అధికారులు

Apr 20, 2026 - 17:45
Apr 20, 2026 - 17:47
 0  1
ధర్మారం గ్రామం నుండి యదేచ్ఛగా చెరువు మట్టి తరలిస్తున్న అక్రమార్కులను ఆపలేరా..చోద్యం చూస్తున్న అధికారులు
ధర్మారం గ్రామం నుండి యదేచ్ఛగా చెరువు మట్టి తరలిస్తున్న అక్రమార్కులను ఆపలేరా..చోద్యం చూస్తున్న అధికారులు

అడ్డగూడూరు 20 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నేను రైతు బిడ్డను "సహజ వనరుల్లో" ఇసుకలో బువ్వను చూసిన ఎమ్మెల్యే గడిచిన రెండు సంవత్సరాల్లో బువ్వకు బదులు "బంగారం కనిపించి దోపిడీలకు పాల్పడుతున్నాడు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామక్రిష్ణారెడ్డి స్థానిక తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామం నుండి  చెరువు మట్టి పెద్ద ఎత్తున టిప్పర్లతో "ఇటుక బట్టిల అవసరాల కోసం వలిగొండ మండలం నందనంకు తరలింపు విషయంలో నేడు అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామక్రిష్ణారెడ్డి నిలదీశాడు. తెలంగాణ ఆగ్రనేషన్ యాక్ట్ పెస్లి మెన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్టీవ్ పనులు 1957 ప్రకారం ప్రభుత్వ ఆస్తి దోపిడీ చట్టాన్ని పట్టించుకొని అధికారులు మొన్న మూసి నుండి ఇసుక నేడు సొంత గ్రామంలో చెరువు మట్టి రేపు ఇంకేంటి..దోచుకుంటారని  ఇట్టి విషయాన్ని ప్రభుత్వ అధికారులు మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ గార్లు పట్టించుకొని అక్రమంగా బయటికి వెళ్తున్న మట్టి దోపిడీని కట్టడి చెయ్యాలని కోరుకుంటున్నాము.

గ్రామ స్థాయిలో ఉండే రైతుల పొలాలకు ఎరువు కోసం లెవెలింగ్ కోసం వాడుకోవాల్సిన చెరువు మట్టి లేదా గ్రామ అభివృద్ధి పనులు రోడ్లు భూమి సమతలీకరణ కోసం వాడుకోవాల్సిన సారవంతమైన చెరువు మట్టిని "బయట ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం చట్ట విరుద్ధం తెలియదా రైతుల వ్యవసాయానికి ఆయువు పట్టులాంటి చెరువు మట్టిని బయట కాంట్రాక్టు వ్యక్తులకు అమ్మడం గ్రామ వనరుల దోపిడీకి నిదర్శనం.. గతంలో కూడా అదే చెరువు నుండి పెద్ద ఎత్తున మట్టి తీయడం వల్ల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం వలన ఆపేయడం జరిగింది కానీ కొన్ని రోజులు గడిచాక  ప్రజలు మరిచారు అనే అపనమ్మకంతో నేడు మళ్ళీ మొదలు పెట్టడం జరిగిందని అన్నారు.చెరువు మట్టిని బయటికి తీయడం వల్ల చాలా పెద్ద నష్టాలు జరుగుతాయని,చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పోతుందని,చెరువు అడుగుభాగం అసమతుల్యంగా మారుతుందని, నీరు నిల్వ ఉండే సామర్థ్యంతగ్గిపోతుందని,వేసవిలో చెరువు త్వరగా ఎండిపోతుందినిభూగర్భ జలాలు తగ్గిపోతాయని చెరువు నీరు నేలలోకి జీర్ణం కావడం తగ్గుతుందని బోర్లు,బావులు ఎండి పోతాయని, గ్రామంలో నీటి కొరత పెరుగుతుందని రైతులకు నష్టం పంటలకు నీరు అందదని దిగుబడి తగ్గుతుందని, రైతులు ఆర్థికంగా నష్టపోతారని జీవ వైవిధ్యం నాశనం అవుతుందని చేపలు,పక్షులు,ఇతర జలజీవులు నశిస్తాయని సహజ సమతుల్యత  దెబ్బతింటుందని, వరదలు మరియు నేల దెబ్బతినడం చెరువు బలహీనపడితే వర్షాలప్పుడు నీరు అదుపులో ఉండదు అని వరదలు వచ్చే అవకాశం పెరుగుతుందని, చుట్టుపక్కల నేల క్షీణిస్తుందని చెరువు మట్టి అనవసరంగా తీస్తే, నీటి కోరత,రైతుల నష్టం, పర్యావరణ నష్టం చట్టపరమైన సమస్యలు ఏర్పడుతాయని ఇన్ని విషయాలు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంటే డబ్బులకు ఆశపడీ చెరువు మట్టిని ఎలా అమ్ముకుంటారని అని అన్నారు.

నాడు బిఆర్ఎస్ పార్టీపై ఇసుకను తరలించనివ్వను అని భారీ ఎత్తున ప్రచారం ఆ ఎన్నికల్లో గెలుపొంది నేడు అదే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ ఇసుకను మట్టిని ఎలా అమ్ముకోవడానికి అనుమతులు ఇస్తావు నాలుగు రోజులు అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో నిన్ను రైతన్నలు,ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.రైతుల వ్యవసాయ భూమిలో మట్టి పోసుకోవాలంటే సంబంధిత అధికారులు మైనింగ్ వారు, తహశీల్దార్ కార్యాలయం వారు రైతులను పట్టించుకోరు అదే చెరువు మట్టీలను అమ్ముకోవడానికి అధికారులు ఎలా ఎగబడి అనుమతులను ఇస్తున్నారు అందులో మీ వాటా ఎంత... అని ఎద్దేవా చేశారు.రైతులు పండించిన వారి ధాన్యాలు కొనడానికి లారీలు దొరకడం లేదు కానీ అదే చెరువు మట్టీలను అమ్ముకోవడానికీ వందల కొద్ది లారీలతో ఎలా మట్టిని తరలిస్తున్నారో నియోజకవర్గ ప్రజలకు తెలుపాలన్నారు.

అడ్డగూడూరు మండల పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీ బలపరిచి గెలిచిన సర్పంచుల గ్రామాల్లో కావాలనే ఎమ్మెల్యే సామేల్ ఆయా గ్రామాల అభివృద్ధికి ఇవ్వాల్సిన ఎన్ ఆర్ జి ఎస్ నిధుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఇదే నా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని గుర్తు చేశారు.ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మెన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,పట్టణశాఖ అధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు,స్థానిక సర్పంచ్ పూజారి వనజ సైదులు గౌడ్,మాజీ ఎంపీటీసీ పూలపెల్లి జనార్థన్ రెడ్డి,కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని, బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు, బాలెంల బాబుమహాజన్, బిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు పయ్యావుల రమేష్, సర్పంచులు చుక్క బాబు, పాశంవిష్ణువర్థన్, మందుల కిరణ్, ఉప సర్పంచ్ వరిగడ్డి లోకేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవినాయకులు వెంపర్ల నర్సిరెడ్డి,బైరెడ్డి నర్సిరెడ్డి, నాగులపల్లి బీరప్ప, కన్నేబోయిన ఎలేందర్,నరేష్,జక్కుల రవి,జక్కుల యాదగిరి,పోతున్నాల నవీన్, గూడెపు పరమేష్, కంచి మత్య్సగిరి, బోనాల మహేందర్, సుతారపు పున్నం, బైరెడ్డి రాంరెడ్డి, గూడెపు మహేష్, పయ్యావుల మత్య్సగిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.