యాసంగి వరి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Apr 21, 2026 - 20:46
 0  1
యాసంగి వరి కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం

25 జిల్లాల్లో ఇప్పటికి ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయని ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన పౌర సరఫరాల శాఖ 

ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కేవలం 3,310 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయగా అందులో దాదాపు 1000 కేంద్రాల్లోనే కొనసాగుతున్న కొనుగోళ్లు

ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు, ములుగు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం కలిపి కేవలం 400 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన ప్రభుత్వం

25 జిల్లాల్లో ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల నిర్వాహణ జరగకపోవడంతో, పెద్ద ఎత్తున దళారులకు, ప్రైవేట్ మిల్లర్లకు పంట విక్రయించాల్సి వస్తుందని రైతుల ఆందోళన 

ఇప్పటికైన ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333