జనగణనలో నివాస గృహాల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్

Apr 18, 2026 - 19:17
Apr 18, 2026 - 19:29
 0  4

హనుమకొండ: 18 ఏప్రిల్ 2026 :-  జనగణనలో భాగంగా చేపట్టనున్న నివాస గృహాల లెక్కింపును ఖచ్చితత్వంతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని చైతన్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో, ఈ నెల 18 నుండి 21 వరకు నిర్వహించనున్న గృహ జనగణన మొదటి విడత (హౌస్ లిస్టింగ్) సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డివిజన్ పరిధిలో హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల వారీగా చేపట్టే జనగణన ప్రక్రియలో భాగంగా సుమారు 350 మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేటాయించిన బ్లాక్‌ల ప్రకారం ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు. సేకరించే సమాచారం పూర్తిస్థాయిలో, ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

జనగణన ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, జవాన్లు, ఆర్పీలు సహకరిస్తారని తెలిపారు. శిక్షణ పూర్తయ్యిన వెంటనే బ్లాక్‌ల వారీగా గణన ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిడబ్లుఎంసి ఆదనవు కమిషనర్ చంద్రశేఖర్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, పర్యవేక్షకులు సంతోష్, ట్రైనర్లు, ఎన్యుమరేటర్లు,  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333