నారాయణ పేట ఆర్డీవో పి.రాంచందర్ 25వేలు లంచం తీసుకుంటుండగా

Apr 21, 2026 - 20:44
 0  2

నారాయణ పేట ఆర్డీవో పి.రాంచందర్ 25వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ బృందం..డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లా గద్వాల ఆర్డిఓ విధులు నిర్వహించిన క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు విన్నవిస్తున్నాయి. గద్వాలలో విధులు నిర్వహించిన క్రమంలో లేని భూములకు ఓ ఆర్ సి మంజూరుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.  తను విధులు నిర్వహించిన అన్ని జిల్లాల్లో అధికారులు నివేదికలు కోరినట్లు సమాచారం. పలు కార్యాలయంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన సొంత ప్రాంతంలో కూడా విచారణ బృందం సోదలకు వెళ్లిందని సమాచారం. గద్వాల  ఆర్డీవో కార్యాలయంలో జరిగిన పలు  అక్రమాలపై ఓ అధికారి తనకు బినామీగా ఉన్నాడని గుర్తించి, ఆ అధికారి ఇళ్లలపై కూడా శోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333