సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర.ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు.ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు*

Oct 5, 2024 - 18:33
Oct 5, 2024 - 19:47
 0  19
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర.ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు.ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు*

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం... ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు, MLC లక్ష్మణ్ రావు గారు

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కోదాడ రోడ్డులో గల బి కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా విశిష్ట విద్య సేవా పురస్కార వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట డివిజన్ అప్పసా డెమోక్రటిక్ అధ్యక్షులు షేక్ కాలేషా గారు సభాధ్యక్షులుగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, మాజీ KDCC బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు గారు, అప్పసా డెమోక్రటిక్ రాష్ట్ర చైర్మన్ గొల్లపూడి మోహనరావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారి చేతులు మీదుగా రాష్ట్ర స్థాయి లో 15 మందికి, జిల్లా స్థాయి లో 21 మందికి, నియోజకవర్గం స్థాయి లో 73 మందికి విశిష్ట విద్యా సేవ పురస్కారాల గ్రహీతలకు అవార్డులను అందజేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు మాట్లాడుతూ

ప్రతి ఉపాధ్యాయుడూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని అన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. మిగితా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట MEO చిట్టిబాబు,వత్సవాయి MEO నాగరాజు, డివిజన్ సెక్రటరీ చుంచు రమేష్, కోశాధికారి పెంట్యాల బాలాజీ, గౌరవ అధ్యక్షులు కొమరగిరి భరద్వాజ్, ఉపాధ్యక్షులు వల్లాపురపు వెంకన్న బాబు, జాయింట్ కార్యదర్శి

 బొల్లా సునీతారామారావు, కార్యవర్గ సభ్యులు ఏసుబాబు, బోబెన్ , స్కూల్ అధినేతలు మందడపు సుధీర్, జి నారాయణ ప్రతాప్ రెడ్డి, రత్నం మరియు రాష్ట్ర, జిల్లా, డివిజన్ పాఠశాలల అధినేతలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State