ఎస్సీ బాలుర హాస్టల్లో జరిగిన "ఫ్రైడే -డ్రైడే"కార్యక్రమం

అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి
చిన్నంబావి, మండలం తెలంగాణ వార్త : మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో శుక్రవారం "ఫ్రైడే-డ్రైడే" కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. హాస్టల్ ప్రాంగణం, వాటర్ ట్యాంక్ లు గదులు, భోజనశాల, పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ విద్యార్థులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. ఎక్కడా నీరు నిలువకుండా చూసుకోవడం, పనికిరాని చెత్తను తొలగించడం, పిచ్చి మొక్కలను తొలగించడానికి రసాయన మందులు పిచికారీ చేయడం వంటి పనులను నిర్వహించారు.ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య రక్షణ, శుభ్రమైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని వర్కర్స్ క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అయితే పరిశుభ్రత ఒక్క రోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు. "శుభ్రతను పాటించడం ద్వారా సగం రోగాలకు దూరంగా ఉండగలుగుతాం. ఆరోగ్యవంతమైన శరీరం ఉంటేనే చదువులో, క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచగలుగుతాం" అని ఆయన పేర్కొన్నారు. తరువాత ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. హాస్టల్ పరిసరాల్లో పచ్చదనం పెరిగితే వాతావరణం హాయిగా మారి, విద్యార్థులకు చదువుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్కర్స్ నరేష్, ఆంజనేయులు చురుకుగా పాల్గొని, విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా సహకరించడంతో హాస్టల్ ఆవరణం మరింత అందంగా మారింది.