సమస్య ఉన్న వెంటనే స్పందించిన వార్డు కౌన్సిలర్ కృతజ్ఞతలు
సూర్యపేట, 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఈరోజు 15వ వార్డు బాలాజీ నగర్ లోని డ్రైనేజీ వాటర్ రోడ్డుపై వస్తుండడంతో వార్డు ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండగా వార్డు ప్రజలు కౌన్సిలర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన కౌన్సిలర్ రోడ్డుపై వాటర్ ఆగకుండా పైపులు వేయించి జేసీబీ తెప్పించి రోడ్డు పై ఉన్న బురద మట్టిని ఖాళీ ప్లాట్ లలో ఉన్న చెట్లను తొలగించిన 15 వార్డు కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు.. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి, తక్షణ సహాయం అందించిన వార్డు కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.