కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీసులు మరియు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు
కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీసులు మరియు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు
- ప్రజల భద్రత కోసమే మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమం.
- ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ తో కూడిన రక్షణ స్టిక్కర్.
- ప్రయాణించే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే సంబంధిత పోలీస్ వారు అలర్ట్ ఐ రక్షణ కల్పిస్తారు.
- దీనితో మహిళలకు, విద్యార్థినులకు, వృద్ధులకు మరింత భద్రత.
- ఆటోవాలాలు బాధ్యతగా ఉండాలి.
- ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలి.
- ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం కోసం పోలీసు కృషి చేస్తున్నది.
- రోడ్డు ప్రమాదాల నిర్ములనకోసం అరైవ్ అలైవ్..
.. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
ప్రజల రక్షణ మహిళల, విద్యార్థ్దినిల రక్షణ, ప్రయాణ సమయంలో మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఇస్ సేఫ్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న ఆటోలకు క్యూఆర్ కోడ్ తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీని అందించడం జరుగుతుందని, దీనిని ఆటోలో అట్టింపెట్టెలా చర్యలు తీసుకుంటున్నాం అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు. ఈరోజు కోదాడ పట్టణంలో సుమారు 800 ఆటో లకు ఈ క్యు అర్ కోడ్ అందించడం జరిగినది అన్నారు.
ఈరోజు కోదాడ పట్టణ లో కాశీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమం లో భాగంగా ఆటో కు క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ఆటో లకు, డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ లు అందజేసి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని దీనిలో భాగంగానే అత్యంత రక్షణ వలయమైన మై ఆటో ఇస్ సేఫ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ ను అందించామని దీని ద్వారా ఎవరైనా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు అనుకోని ఇబ్బందులకు గురైనట్లయితే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ యొక్క స్థితిగతులను, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పోలీసు వారికి తెలియజేసే అవకాశం ఉందని దీని ద్వారా మీరు మరింత భద్రంగా ఉంటారు అని, దీనిలో భద్రతా పరంగా టీ సేఫ్ అనే యాప్ కూడా ఉన్నది అన్నారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కినట్లయితే క్యూఆర్ కోడ్ ప్రొవైడర్ ద్వారా సంబంధిత పోలీసు వారికి సమాచారం చేరి పోలీస్ వారు అలర్ట్ అవుతారు మీకు రక్షణ కల్పిస్తారని అన్నారు. దీని ద్వారా మహిళలకు విద్యార్థినిలకు, బాలికలకు, వృద్ధులకు, పిల్లలకు చాలా ఉపయోగకరమైనదిగా, రక్షణగా ఉంటుందని తెలియజేశారు. ప్రయాణికులను చేరవేసే సమయంలో ఆటో డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని వారిని సురక్షితంగా గమ్యానికి చేర్చాలని కోరారు. ఆటోలు నడుపుతున్న వారిలో విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారని సమాజాన్ని చైతన్య పరచడంలో మీ వంతుగా కృషి చేయాలని అన్నారు ప్రతిరోజు ఎంతోమంది ప్రజలను కలుస్తుంటారని అన్నారు. ప్రజల రక్షణలో, సురక్షితంగా గమ్యం చేర్చడంలో బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్రమాదాల నిర్మూలన కోసం పోలీసు శాఖ అనుక్షణం కృషి చేస్తుంది అని తెలిపారు, రోడ్డు ప్రమాదాలు నిర్మూలించి ప్రతి ఒక్కరు సురక్షిత గమ్యం చేరడం ఏ లక్ష్యంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు.
హాజరైన విద్యార్థులను, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ప్రయాణించే సమయంలో ఈ క్యూఆర్ కోడ్ సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు అని భావితరాలని అన్నారు, ఆర్థిక వేత్త అయిన అమర్త్యసేన్ యువతను ఉద్దేశించి భారత దేశ భవిష్యత్తు, అభివృద్ధిలో యువతే ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలియజేశారు అని గుర్తు చేశారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి శక్తిని కోల్పోతున్నారని మాదకద్రవ్యాలకు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నా రవాణా చేస్తున్న వినియోగిస్తున్న అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టణ పోలీసులను, సిఐ శివ శంకర్ ను, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి ను అభినందించారు. భద్రత పరమైన సాంకేతికతను అందించిన యాప్ నిర్వాహకులు రమేష్ రెడ్డి నీ ఎస్పి గారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, మై ఆటో ఇస్ సేఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ రెడ్డి, ఎస్సై అంజి రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.