షేక్ పల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ 2 నందు పోషణ పక్షం కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 16 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఎర్రవల్లి. పోషణ పక్షం సందర్భంగా షేక్ పల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ 2 నందు పోషణ పక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం వంటల పోటీ ఈసీసీఇ డే గర్భిణీ స్త్రీలకు సీమంతాలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వంటల కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకు బహుమతులు ఎం జి యువరాజ్ స్పాన్సర్ చేసి విజేతలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ.... గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మరియు పిల్లలు వారి తల్లిదండ్రులకు చిరుధాన్యాలు వాటిలో ఉండే పోషకాలు గురించి మరియు ఆకుకూరలు కూరగాయలు తినడం ద్వారా వాటిలో ఉండే పోషకాలను వివరించడం జరిగింది. ఆరు నెలలు పూర్తి అయిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు అలాగే మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులు అంగన్వాడీ కేంద్రమునకు ఫ్రీ స్కూల్ అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్య అంగన్వాడీ టీచర్స్ మయూరి జయమ్మ ఆయా సురేఖ గ్రామ ప్రజలు ఎంజి యువరాజ్ గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.