ఫిబ్రవరి-10న చలో ఢిల్లీ మహా ధర్నాను జయప్రదం 

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేత కరపత్రం విడుదల

Jan 17, 2025 - 18:48
 0  7
ఫిబ్రవరి-10న చలో ఢిల్లీ మహా ధర్నాను జయప్రదం 

యాదగిరిగుట్ట 17 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్.పి.ఆర్.డి)అద్వర్యంలో ఫిబ్రవరి 10న ఢిల్లీలో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చెయ్యాలని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కరపత్రం విడుదల చేయడం జరిగింది.అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 300 రూపాయల పెన్షన్ ఇస్తూ వికలాంగులను మోసం చేస్తుందని వెంటనే కేంద్ర ప్రభుత్వ వాటా 5వేలకు పెంచాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.ఉపాధి హామీ పథకం లో వికలాంగులకు 200 పని దినాలు కల్పించాలని,వికలాంగుల పరిరక్షణ చట్టన్నీ దేశవ్యాప్తంగా పటిష్టంగా అమలు చెయ్యాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు బొల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు నాయకులు విజయ్ కుమార్  బానోత్  హరి తదితరులు పాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333