జిల్లా కలెక్టర్ తో జిల్లా అభివృద్ధి పై సమీక్షించిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కలెక్టర్ బిఎల్ సంతోష్ .
జోగులాంబ గద్వాల 6 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. త్వరలోనే పాఠశాలలో పున ప్రారంభ కావడం జరుగుతుంది. కావున పాఠశాలలోని చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి కోరారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో సరైన రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మట్టి రోడ్డును కొరకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ద్వారా మాట్లాడి వెంటనే గ్రామీణ ప్రాంతాలలోని అభివృద్ధి కొరకు నిధులను విడుదల చేసే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో గద్వాల నియోజకవర్గంలో ప్రత్యేక నిధులతో చేపట్టిన వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా ప్రత్యేక నిధులు విడుదల చేసి త్వరగా పనులు పూర్తి చేయాలి ప్రజల్లోకి ఉపయోగకరమైన వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.