పేదింటి బిడ్డ చదువుకు అండగా నిలబడ్డ కానా సంస్థ యజమాన్యం
నల్గొండ 23 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సల్లూరి ప్రియమణి పదవ తరగతిలో 570/600 మార్కులు సాధించి కూడా పై చదువులకు ఆర్ధిక స్తోమత లేకపోవడంతో తన ఇంటర్ చదువు ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ దత్తు(డిఆర్పి కౌన్సిలర్) బోటనీ లెక్చరర్ కుంబజడ వీరబాబు కానా సంస్థ గురించి తెలుసుకొని సల్లూరి ప్రియమణి డాటర్ ఆఫ్ సత్తయ్య గౌడ్ విషయాన్ని కానా స్థానిక ప్రతినిధి గణేష్ నాతి దృష్టికి తీసుకురాగా వెంటనే అమెరికాలో ఉన్న కానా సంస్థ వారు,80 వేల రూపాయలు ఫీజు స్థానిక ప్రతినిధులు నాతి గణేష్,బాల్నే రామచంద్రుడు ద్వారాకట్టించి విద్యార్థిని మొదటి సంవత్సరానికి చేయూతనిచ్చారు.విద్యార్థిని ప్రియమణి కూడా తనచదువును కొనసాగించి,మంచి ప్రతిభ కనబర్చి,ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా ఉంటానని బృందం సభ్యులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కానా వారు, దత్తు,కేషవ్,సాయి క్రిష్ణ,వీరబాబు పాల్గొని,విద్యార్థిని మోటివేట్ చేయడం జరిగినది. ఎలాంటి సంబందం లేకున్న మానవత దృక్పధంతో ప్రియమణి చదువులకు ఆర్ధిక సహాకారం చేసిన కాన సంస్ధవారికి ఆల్ ఫోర్స్ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.