ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

20/07/2025
చర్ల
CPI (M-L) న్యూడెమోక్రసీ,నేత ముసలి సతీష్ డిమాండ్
చర్ల మండలం నుండి వెంకటాపురం మండలం వరకు దాదాపు 25,పైగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి వేయిల లారీలలో అక్రమంగా ఇసుకను తరలించాడాన్ని ఆపాలని *CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.*
ఈ సందర్బంగా ముసలి సతీష్ మాట్లాడుతూ చర్ల మండలంలో సంవత్సరాల తరబడి గోదావరి నుండి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పనుల పేరుతో రోజుకు వేయిల లారీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల ఓవర్ లోడ్ ఇసుక లారీలను రోడ్లమీద నిలుపుతున్నారని దీనిలో భాగంగా చర్లమండలం నుండి వెంకటాపురం మండలం వరకు గత 3నెలలుగా పూర్తి స్థాయిలో బస్సులు బందు అయ్యి వేల లారీలు రోడ్లమీద ఇరువైపులా నిలిచిపోవడం వలన కనీసం అంబులెన్స్ కూడా దారి లేకుండా పోయిందనీ ఆయన అన్నారు ఇసుకను 100ల జెసిబి యంత్రాలతో అడుగంటి తవ్వకాలు జరిపి పూర్తిస్థాయిలో ఇసుకను తరలించడం మూలంగా భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు దెబ్బతింటూన్నాయని, నీటి కాలుష్యం ఏర్పడుతుందని ముసలి సతీష్ అన్నారు. రోజుకు వేయిల సంఖ్యలో లారీలల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్నారని ఆయన అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇసుక తరలింపును ఆపాలని, లేకుంటే భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.గోదావరి నడి మధ్యలో ఇసుకను 100ల,జేసీబీలతో దోపిడీ చేస్తున్నారన్నారు. చర్ల మండలం వెంకటాపురం మండలంలో గోదావరి ఇసుకను లూటీ చేస్తున్నారని,ర్యాంపుల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ అనేది జరుగుతున్న ప్రభుత్వ అధికారుల తోడ్బలంతో జరుగుతుందనీ ముసలి సతీష్ అన్నారు.స్టాక్ యార్డ్,చెక్ పాయింట్లు,వే బ్రిడ్జిల ఊసే లేదని ముసలి సతీష్ మండిపడ్డారు.లెక్కకు మించి వేయిల లారీలతో జియో ట్యాగ్ లేకుండా ఇసుకను వేయిల లారీలలో తరలిస్తున్నారని ముసలి సతీష్ మండిపడ్డారు. ఇది ఇలా కొనసాగితే రైతుల పొలాలు మట్టిదిబ్బలుగా మారుతున్నాయ అన్నారు.(TSMDC)తెలంగాణ రాష్ట్ర ఖనిజాబివృద్ధి సంస్థ నిబంధనలను మంత్రులు తుంగలో తొక్కరని ఆయన అన్నారు. గ్రామాల నుండి మధ్య దళారులు బొకర్ల ద్వారా ఇసుక తరలించి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని అలాంటి దందాలు చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులు ప్రశ్నిస్తే వారి పైన రేజింగ్ కాంట్రాక్టర్లు దాడులు చేపిస్తున్నారని ఎర్ర జెండా పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజల సొమ్ము రోడ్లు బిర్జీలు కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నారని ముసలి సతీష్ అన్నారు ఈ కార్యక్రమంలో కప్పల సూర్యకాంతం కోట నాగమణి ఆదిలక్ష్మి రాజమ్మ శ్రీదేవి కమల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు