వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని సాతర్ల గ్రామంలో రైతు వేదిక వద్ద వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేసుకోవాలని గ్రామంలోని రైతులకుసూచించారు. తక్కువ కాల వ్యవధిలో పండే పంటలు మరియు కూరగాయలు పండించాలని రైతులకుసూచించారు. రైతులు పంట కాలవలు నిర్మించుకోవాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయ పద్దతులు పాటించాలి అని సూచించారు. నానో యూరియా మరియు నానో డి ఏ పి వాడాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట పండించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవి కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్, ఉద్యానవన శాఖ విస్తరణ అధికారిని అరుణ, iffco company ప్రతినిధి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు