ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం - ప్రతిజ్ఞ కార్యక్రమం.
PHC - Uppair ఆధ్వర్యంలో పాత DMHO ఆఫీస్ నందు ఘనంగా నిర్వహణ
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day) సందర్భంగా ఈరోజు పాత DMHO ఆఫీస్ నందు ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయబడింది... PHC - Uppair మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రవీందర్ సందర్బంగా మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, కుంగుబాటుకు గురైన వారికి మనం అండగా ఉండాలని, వారికి ధైర్యం చెప్పి, సరైన సమయంలో కౌన్సెలింగ్, వైద్య సహాయం అందించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వారి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులందరితో కలిసి ఆత్మహత్యల నివారణ ప్రతిజ్ఞ చేయించారు. "మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం - జీవితాన్ని కాపాడుదాం" అనే నినాదంతో ఈ ప్రతిజ్ఞ జరిగింది. ఇట్టి కార్యక్రమంలో MPHEO రవీందర్, హెల్త్ సూపర్వైజర్లు శ్యాంసుందర్, లక్ష్మి, MLHP స్టాఫ్, ANMs, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.