వేలకు రాణి బస్సు.. పాఠాలు మిస్ అవుతున్న విద్యార్థులు

Mar 5, 2024 - 19:43
Mar 7, 2024 - 01:43
 0  31
వేలకు రాణి బస్సు.. పాఠాలు మిస్ అవుతున్న విద్యార్థులు
వేలకు రాణి బస్సు.. పాఠాలు మిస్ అవుతున్న విద్యార్థులు

ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు ఇంతేనా

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తప్పని కష్టాలు.

పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో విద్యార్థులు.

జోగులాంబ గద్వాల 5 మార్చ్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాజోలి అలంపూర్ నియోజకవర్గం, రాజోలి మండలం, మాన్దొడ్డి గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పక్కనే ఉన్న పచ్చర్ల గ్రామం నుండి గత 30 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం పాఠశాలకు చదువుకోవడానికి దాదాపుగా 50 నుంచి 70 మంది వరకు విద్యార్థులు చదువుకోవడానికి వెళుతుంటారు. కానీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు బంగారు తెలంగాణ ను సాధించుకుందామని ప్రభుత్వాలు చేయని ప్రయత్నం అంటూ లేదు, అలాంటి ప్రయత్నంలో విద్యార్థులకు ఎన్నో కష్టాలు. పట్టించుకోని ప్రభుత్వాలు,ప్రజానాయకులు,అధికారులు, ఉన్నత అధికారులు. ఉదయం 10 గంటల లోపు పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు 11:40 గంటల నిమిషాలు అయినా కూడా పాఠశాలకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ బంగారు తెలంగాణలో వారికి కలిగింది. జాబిల్లి దక్షిణ ధ్రువం పై భారత పతాకం రెపరెపలాదింది. ఆ గొప్పతనం, ఆ కీర్తి, ఆ పట్టుదల అనేది విద్యార్థుల విద్యా దశ నుంచే మొదలవుతుంది. మన దేశానికి గొప్ప కీర్తిని సాధించిన వారు, ఒకప్పుడు వారు కూడా విద్యార్థులే.. మరి విద్యార్థుల పట్ల విద్యా పట్ల నిర్లక్ష్యం తగదు,  గద్వాల బస్ డిపో మేనేజర్  దృష్టికి తీసుకెళ్లిన సమయానికి రాని బస్సు అని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన సమయంలో మేము సరిగా పాఠాలు నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఉదయం 9:30 నిమిషాలకు పాఠశాల చేరుకోవాలి కానీ 12 గంటలు అయితే కూడా పాఠశాల చేర్చుకోలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని, వేలకు రాణి బస్సుతో మేము పాఠాలు మిస్ అవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కష్టాలు తప్పవని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. మా పిల్లలు పరీక్షలు రాసే సమయం దగ్గర పడుతున్నది. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా నాయకులు, అలంపూర్ శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొని సమయానికి బస్సు పంపి మా పిల్లల బంగారు భవిష్యత్తుకు భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకునే విధంగా సాయపడాలని కోరుతున్నాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333