వీఓఏలు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి

Jul 26, 2024 - 21:07
 0  4
వీఓఏలు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి

వీఓఏలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరచాలి 

* బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ 

వీఓఏలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యమించాలని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ, వీఓఏల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కన్నం శారద, జగిత్యాల జిల్లా అధ్యక్షులు తిరుపతిలు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన వీఓఏల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. వృత్తిపరంగా వీఓఏలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 17261మంది వీఓఏలుగా పని చేస్తున్నారని వారిని గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అన్ని రకాల పనులను చేస్తూ తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏ లకు పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలన్నారు. వీఓఏ లకు యూనిఫామ్ తో పాటు పదిలక్షల ఇన్సూరెన్స్,  అర్హత కలిగిన వారికి సీసీలుగా పదోన్నతి ఇవ్వాలన్నారు. వృత్తిపరంగా వీఓఏలపై పని భారం లేకుండా చూడడంతో పాటు రాజకీయ వత్తిళ్లను నివారించాలన్నారు. గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. VOA ల సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పండగ శైలజ,  ఉపాధ్యక్షులు నర్సింగ్ నాయక్,  కోశాధికారి ఉమారాణి,  నాగేంద్ర శైలజ, సునీత,  చంద్రకళ, మల్లేష్, జ్యోతి, స్వరూప, నాగేంద్రమ్మ,  వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333