విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.
నాగారం జూన్ 23:- మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే ఈటూరు గ్రామంలోని ఎస్సీ కొత్త కాలనీలో నివాసముంటున్న యలా యాదగిరి ఇంటిలో దాదాపు రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇల్లు ఇంటిలోని వస్తువులన్నీ దగ్దమైనాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకొని నష్టపరిహాన్ని చెల్లించాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న ఆర్ ఐ లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి వెళ్ళి పంచనామా నిర్వహించి దాదాపు నాలుగు లక్షల అస్తి నష్టం జరిగిందని తెలిపారు.