గ్రంథాలయ వారోత్సవాల ముగింపు  పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్

Nov 20, 2024 - 17:20
 0  7
గ్రంథాలయ వారోత్సవాల ముగింపు  పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్
గ్రంథాలయ వారోత్సవాల ముగింపు  పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్

జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల విద్యార్థులు పాఠనాశక్తి పెంచుకోవడం వల్ల మంచి ఆలోచన కలుగుతుందని దానివల్ల మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భగంగా  జిల్లా గ్రంధాలయ సంస్థ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిపిఓ శ్యాంసుందర్ తో కలిసి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రంథాలయ బలోపేతానికి గ్రామపంచాయతీల నుండి వచ్చే సెస్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నూతన భవన నిర్మాణ పనులు పూర్తిచేసేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇతర ప్రాంతాలలో మున్సిపాలిటీలలో గ్రంథాలయాలు అన్ని సౌకర్యాలతో కూడుకున్నవని ఇక్కడ గ్రంథాలయ ఏర్పాటు చేస్తే అన్ని ఏర్పాట్లు ఉండేలా కృషి చేస్తామన్నారు. ప్రత్యేకంగా పాఠకులకు గదులు రికార్డు గది ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. గతంలో గ్రంధాలయాలలో దినపత్రికలు నవలలు మాత్రమే ఉండేవని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకునే వారమని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంచడం వల్ల వారు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారని ఎందుకు తగినట్లుగా విద్యపై ఆసక్తి గల దాతలను అన్వేషించి పుస్తకాలు సమకూర్చుకోవాలని అన్నారు. విద్యార్థులు చదవడం పట్ల ఆసక్తి అలవరిస్తే వారికి మంచి ఆలోచనలు కలుగుతాయని దాంతో సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం సాంకేతిక యుగంలో ఉదయం పత్రికలు చూసే ఓపిక తక్కువ అయిందని ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు మొబైల్ ఫోన్లు వాడకం పెరిగిపోయిందన్నారు. మొబైల్ ఫోన్లను వాడవచ్చు కానీ అందులో విద్యకు సంబంధించిన సమాచారం సేకరించి చదువుకు వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోపాటు సంస్కారం ఉండాలని సంస్కారం లేని చదువు వ్యర్థమని అన్నారు. ఎందుకు భాస్కర శతకంలోని ఒక పద్యాన్ని వినిపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇటీవల నిర్వహించిన వ్యాసరచన తదితర పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, కార్యదర్శి శ్యాంసుందర్, గ్రంథాలయ కార్యదర్శి రామాంజనేయులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333