పేదింటి కలలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ తీగల గిరిధర్ రెడ్డి

Mar 5, 2024 - 19:38
 0  4
పేదింటి కలలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ తీగల గిరిధర్ రెడ్డి

నూతనకల్..మేజర్ న్యూస్..పేదింటి కలలను నెరవేరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి లు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి విద్యుత్ బిల్లులను జీరో బిల్లులుగా చేసి జీరో బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేద ప్రజల కలలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు మహేశ్వరం చంద్రకళ వెంకటయ్య,డీసీసీ కార్యదర్శి గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య, నాయకులు దేవి రెడ్డి నర్సిరెడ్డి, బండపల్లి సాగర్,జటంగి గణేష్, సామ ఉపేందర్ వాసు,జాకీర్,బాబురావు, నెల్లుట్ల మహేష్, విద్యుత్ శాఖ ఏఈ ప్రవీణ్ కుమార్,విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333