విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చదవాలి

Jun 30, 2026 - 19:28
 0  1
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చదవాలి
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చదవాలి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

జోగులాంబ గద్వాల 30 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చదవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను అకస్మాదికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పదో తరగతి విద్యార్థుల కు కీలకమైన దశ అని ప్రస్తుతం చదివే విద్యార్థులు తమ భవిష్యత్తు గొప్పతనం కోసం కష్టపడి చదవాలని వారు కోరారు. వెనకబడ్డ విద్యార్థులు ప్రత్యేక కృషి ఫలితంగా ఆయా సబ్జెక్టులను ఉపాధ్యాయులు శ్రమించి ముందుకు తీసుకురావాలని ఆదేశించారు. గత ఏడాది పదో తరగతిలో సాధించిన మార్కులు కంటే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇటీవల జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎవరైనా సెలవు పెడితే. ఒకటి రెండు రోజులు ముందుగా సంబంధిత అధికారులకు సెలవు సిటీ ఇవ్వాలని చెప్పినప్పటికీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మంగళవారం ఉదయం వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తపరిచారు. వెంటనే మేము జారీ చేయాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుకకి ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల. హాజరు రిజిస్టర్ తో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. ఫుడ్ కమిటీ సభ్యులుగా ఉన్న విద్యార్థులు క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అందుకు అనుగుణంగా భోజనం వడ్డించాలని తెలిపారు. పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు యుఐసి లో నమోదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థిని నందిని ఫుట్బాల్ లో ప్రతిభ కనబరిచినందుకు గచ్చిబౌలిలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీకి ఎంపిక కావడంతో కలెక్టర్ ఆ విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోనే ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333