విద్యార్థులకు ప్లేట్లు, బాక్సుల పంపిణీ.

Aug 15, 2026 - 19:58
Aug 16, 2026 - 03:20
 0  0
విద్యార్థులకు ప్లేట్లు, బాక్సుల పంపిణీ.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ . మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్లేట్లు, టిఫిన్ బాక్సులను అందించారు. పెద్దింటి శ్రావణ్ కుమార్, నాగరాజు, మని తేజ ల సహకారంతో 200 మంది విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలగం మల్లేష్, భూతం ఏకమల్లు, రమేష్, సోమిరెడ్డి రాంరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.