వికలాంగులకు 6వేల పెన్షన్ ఇవ్వాలి!పెండింగ్ లో ఉన్న వికలాంగుల పెన్షన్ విడుదల చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కలెక్టర్ ఆదేశాలను పాటించని అధికారులు
భువనగిరి 17 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి జిల్లా గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు మరియు జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన 6వేలు పెన్షన్ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా గత 3సంవత్సరాలుగా వికలాంగుల పెన్షన్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని అర్హులైన వికలాంగులందరికీ పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కలెక్టర్ గారిచ్చిన ఆమెని సైతం విస్మరించడం వికలాంగుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతుందని వారు అన్నారు వెంటనే అధికారులు వివక్షత విడనాడి ఇందిరమ్మ ఇళ్లల్లో ఐదు శాతం వాటా కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.వికలాంగుల స్వయం ఉపాధి కోసం కేటాయించిన రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గతంలో దరఖాస్తు చేస్తున్న వికలాంగుకు రుణాలను కేటాయించకుండా వారిని మోసం చేయడం తగదని అన్నారు వెంటనే గతంలో దరఖాస్తు చేసిన వికలాంగులు అందరికీ ఇలాంటి షరతులు లేకుండా రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సహాయ పరికరాలు అవసరం ఉన్న వికలాంగులందరికీ కేటాయించాలని కోరారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.లేనిపక్షంలో పెద్ద ఎత్తున వికలాంగులను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత మహిళా నాయకురాలు కొండాపురం మనోహర పార్వతి ఉపాధ్యక్షుడు అంజయ్య గడ్డం యాదగిరి ఏర్పుల శివయ్య నాయకులు లింగం నాయక్ శ్రీహరి గిరిక లింగస్వామి విజయ్ రంగ సంతోష్ వెంకటేశ్వర్లు గోపి వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.