లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వివాహ వార్షికోత్సవ వేడుకలు

తిరుమలగిరి 24 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రానికి చెందిన లయన్ యం. గిరి గౌడ్ మరియు మమత వివాహ వార్షికోత్సవ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ నాగారం మండలం పణిగిరి గ్రామానికి చెందిన .పూజ, మండల టాపర్ గా నిలిచి 545 మార్కులు సాధించినందుకు గాను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూజకు అభినంద రూపకంగా (రూ 2016/-) ఇస్తూ శాలువతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు S.సోమేష్, కార్యదర్శి రమేశ్ , కోశాధికారి D. గణేష్ లయన్ మంద పద్మారెడ్డి , లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు , లయన్ రామచంద్రన్ గౌడ్ , లయన్ సుందర్ , లయన్ ఐత శ్రీనివాస్ , లయన్ బుక్క శీను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు .....