నూక వీరారెడ్డి పార్టీకి చేసిన సేవ చిరస్మరణీయం.....

మునగాల 06 సెప్టెంబర్ 2025
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల:మండల పరిధిలోని నేలమర్రి గ్రామానికి చెందిన ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వీరారెడ్డి మరణం వారి కుటుంబానికి తీరని లోటని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు.శనివారం నేలమర్రి లో వీరారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరినాగిరెడ్డి మాట్లాడుతూ, నూకల వీరారెడ్డి మరణం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి తీరంలోని కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవ చిరస్మరణీయమని అన్నారు.ఈకార్యక్రమంలో యం.యస్.విద్యాసంస్థల సీ.ఈ.వో. యస్ యస్ రావు,రణబోతు అప్పిరెడ్డి,ఇంద్రారెడ్డి,పలువురు కుటుంబ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.