రైతులందరూ రైతు భీమకు అప్లై చేసుకోవాలి
ఈవో పాండురంగచారి

అడ్డగూడూరు 09 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
అడ్డగూడూరు మండలంలోని రైతులందరీకి ఏవో పాండురంగ చారి తెలియజేయునది ఏమనగా ఆఫీస్ యందు 05.06.2025 నాటికి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు 2025 పాలసీ సంవత్సరానికి రైతు బీమా కింద నమోదు కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు మండల వ్యవసాయ అధికారులను వెంటనే సంప్రదించవలెను.13.08.2025 రైతు భీమా నమోదుకు చివరి తేదీ.8వ పాలసీ సంవత్సరం అంటే 2025 పాలసీ సంవత్సరం14.08.2025 నుండి ప్రారంభమై13.08.2026తో ముగుస్తుంది.14.08.1966 మరియు 14.08.2007 మధ్య జన్మించిన రైతులు రైతు భీమా కింద నమోదుకు అర్హులు.పుట్టిన తేదీ ఆధార్ ప్రకారం మాత్రమే పరిగణించబడుతుంది.రైతు ఎన్రోల్మెంట్ ఫారం,పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు,రైతు మరియు అతని/ఆమె నామిని ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు,నామిని బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులకు స్వయంగా సంప్రదించి ఇవ్వవలెను ఇప్పటికే రైతు బీమాకు నమోదు చేసుకున్న రైతులు తమ నమోదు రెన్యువల్ గురించి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో కన్ఫామ్ చేసుకోవలెను,ఏవైనా సవరణలు ఉంటే 12.08.2025 లోపు సవరణకు సంబంధించి మద్దతు ఇచ్చే పత్రాలతో ఏ.ఈ.ఓ మరియు మండల వ్యవసాయ అధికారినిసంప్రదించి సవరణ చేయించుకోవలెను.రైతు భీమా నమోదు కొరకు రైతు యొక్క వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ 59 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న రైతులు మాత్రమే అర్హులు అని ఏవో పాండురంగ చారి తెలిపారు.