రైతు మహాదర్నాను విజయవంతం చేయాలి
మాజీ MLA నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణవార్త జనవరి 19 మిర్యాలగూడ :- 21 వ తారీఖు నాడు నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్ నందు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగామహా దర్నాకలదు ఇట్టి రైతు దర్నా కు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మాజీ మంత్రివర్యులు KTR విచ్చేయుచున్నారు కాగా ఈ రోజు మిర్యాలగూడ పట్టణము రెడ్డికాలనీలో గల BRS పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు.. కెసిఆర్ రైతు బంధు కింద 10 వేలు ఇచ్చారు.. కాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 15 వేలు ఇస్తామని చెప్పి అధికారములోకి వచ్చి సంవత్సరం దాటిన ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలములో అమలు చేసి చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని తెలిపారు.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా 21 వ తారీఖు నాడు రైతు దర్నా చేపట్టడం జరిగినది కావున ఈ దర్నా కార్యక్రమానికి BRS పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విధ్యార్ధి నాయకులు, మహిళలు, రైతులు మరియు KCR అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని కోరారు కార్యక్రమములో DCMS వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, రైతు బంధు జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మోషీన్ అలీ, ఉద్యమ నాయకులు యడవెల్లి శ్రీనివాస రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ లు ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగా రెడ్డి,అంగోతు హాతీరాం నాయక్, మక్ధూమ్ పాషా, ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, మట్టపల్లి సైదయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య,ధనావత్ బాలాజీ నాయక్,కుర్ర సేవ్య నాయక్, అమరావతి సైదులు, చోగాని బిక్షం గౌడ్, మిరియాల మధుసూదన్, జేరిపోతుల రాములు గౌడ్, పేరాల కృపాకర్ రావు, షోయబ్, బారెడ్డి అశోక్ రెడ్డి,చిర్ర మల్లయ్య యాదవ్, పునాటి లక్ష్మీ నారాయణ,ఐల వెంకన్న, సందేశీ అంజన రాజు,రవీందర్ నాయక్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, దుర్గా ప్రసాద్ గుడిసె, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, నాగభూషణం, కట్టా మల్లేష్ గౌడ్, కోల రామస్వామి, ప్రకాష్ నాయక్, ఫయాజ్ BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..