విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలి
.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కి వినతి
మునగాల, 02 జులై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం మూలంగా పాఠశాలలు ప్రారంభమై గత 20 రోజులు అవుతున్న నేటికీ పాఠశాల విద్యార్థులకు 100% పాఠ్య పుస్తకాలు అందించలేకపోయారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ అన్నారు, మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ బి సత్యనారాయణ కు వినతి పత్రం అందజేశారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు అందించే సన్నబియ్యం నాణ్యత కలిగిన బియ్యం ఇవ్వకపోవడంతో భోజనం రుచిగా ఉండటం లేదని, గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి అని, విద్యార్థులకు కనీస వసతులైన బాత్రూం సౌకర్యం, మంచినీటి వసతి, తరగతి గదుల్లో కూర్చోవడానికి బెంచీలు, ఫ్యాన్లు లైట్లు ఆట వస్తువులు మౌలిక సౌకర్యాలు కల్పించి. ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా అధిక రేట్లతో అమ్ముతున్న పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, షూస్ ఇతర సామాగ్రిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఏ శివ, ముస్తఫా, వెంకీ చందు తదితరులు పాల్గొన్నారు.