ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ అధికారులు అందుబాటులో ఉండాలి:జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస రావు

Jul 23, 2024 - 19:42
 0  1
ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ అధికారులు అందుబాటులో ఉండాలి:జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస రావు

విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలి.

ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టి నిర్ణీత సమయంలో చేదించాలి

జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన  నేర సమీక్షా సమావేశంలో  జిల్లా ఎస్పీ.

జోగులాంబ గద్వాల 23 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా లో ఆయా పోలీస్ స్టేషన్ ల పోలీస్  అధికారులు ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,  ప్రాపర్టీ కేసుల లో అలసత్వం చూపకుండా నిర్ణీత సమయంలో చేదించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ హాల్ లో జిల్లాలోని పోలీస్ అధికారులతో జిల్లా  ఎస్పీ నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు.అందులో భాగంగా ముందుగా   జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో ఈ నెలలో జరిగిన నేరాల వివరాలు, అందుకు గల కారణాలు, కొత్త చట్టాల ప్రకారం ఆయా సెక్షన్ ల క్రింద నమోదు అవుతున్న కేసుల వివరాలను జిల్లా ఎస్పీ  పోలీస్ స్టేషన్ ల వారిగా పరిశీలించారు. నమోదు అయిన సూసైడ్ కేసులలో సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా లో ప్రాపర్టీ కేసులు జరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి నేరాలు జరుగకుండ తగు చర్యలు తీసుకోవాలని , ఛేదించిన ప్రాపర్టీ కేసులను వెంటనే చేధించాలని, అందుకు అవసరమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్, సమాచార సేకరణ ద్వారా నిందితులను గుర్తించి పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ కేసులను చేదింఛలని అన్నారు. నమోదు అయిన కేసులలో విచారణ జరుగుతున్న వివరాలు  తెలుసుకొని ఎస్ ఓ పి నీ అనుసరించి, నూతన స్కిల్స్ ను ఉపయోగించి  పారదర్శకంగా విచారణ చేయాలని తద్వారా మంచి ఫలితాలు రాబట్టగలమని అధికారులకు సూచించారు. చార్జీ షీట్ కు అవసరమైన ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్, మెడికల్ సర్టిఫికెట్స్ పెండింగ్ లేకుండా తెపించుకోవాలని, మహిళల మిస్సింగ్ కేసులను  వెంటనే చేదించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలో మండల హెడ్ క్వార్టర్స్ లలో ఆటో డ్రైవర్ లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలు ఆత్మహత్యల కు పాల్పడకుండా , విద్యుత్ షాక్ కు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పోలీస్ కళా బృందం ద్వారా అవగహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేవ్ కేసులలో డిటెక్ట్ శాతాన్ని పెంచాలని, పడిస్ అక్రమ రవాణా కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, జిల్లాలో నీవసిస్తున్న  విదేశీయులను గుర్తించి వివరాలు పొందుపరచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టాలని నిత్యం వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు. సైబర్ నేరాలకు సంబంధించి 25000/- , ఆ పై డబ్బులు పోగొట్టుకున్న సైబర్ నేరాల పై FIR నమోదు చెయ్యాలని, ఫ్రిజ్ అయిన అమౌంట్ ను కోర్టు అనుమతి ద్వారా తిరిగి బాధితులకు అందజేయాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రుణ మాఫీ నీ సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకొని మోసాలకు పాల్పడుతున్నార ని , మోసపోకుండా ఉండేందుకు ,సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 కు సమాచారం ఇచ్చుట  వాటి పై రైతులకు అవగహన కల్పించాలని సూచించారు. అధికారులు ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలని ఆదేశించారు.దొంగతనం కేసులను చెదించడం లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి క్యాష్ రివార్డ్ తో అభినందించిన జిల్లా ఎస్పీ పట్టపగలు గద్వాల్ టౌన్, గట్టు, మధ్యల బండ లలో ఇండ్లలో దొంతనాలకు పాల్పడిన దొంగను, ఐ జ, గట్టు మండలలో దేవాలయాలలో హుండి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను గుర్తించే కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రంజిత్, కానిస్టేబుల్స్ చందు, రామకృష్ణ, ఇస్మాయిల్ లను జిల్లా ఎస్పీ గారు ఒక్కొక్కరికీ 2000/- రూపాయాల క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ  శ్రీ కె.గుణ శేఖర్,డి.ఎస్పి శ్రీ కె.సత్యనారాయణ,  గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర సి. ఐ లు బీమ్ కుమార్, రవి బాబు,  టాటా బాబు  జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల  ఎస్సైలు, డీసీఆర్బీ, సిబ్బంది, ఐటీ సెల్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333