రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజుల పాటు మీ సేవలు బంద్..!
అడ్డగూడూరు 03 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు.కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం నుండి ఆదివారం సెలవులు కావడంతో,మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.