గ్రామపంచాయతీ కార్యాలయం ప్రస్తుతం

Jul 24, 2026 - 21:30
 0  3
గ్రామపంచాయతీ కార్యాలయం ప్రస్తుతం

 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి: సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతా    తెలంగాణ వార్త ప్రత్యేక కథనం గత పాలకుల నిర్లక్ష్యం ......ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..........ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్ ......నూతన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం......లింకు రోడ్లు పనులు ముమ్మరం .......50 లక్షల రూపాయల తో అభివృద్ధిపనులు........ఎమ్మెల్యే సహకారంతో పెండింగ్ పనులను నెరవేరుస్తా

తిరుమలగిరి 25 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధి సముద్ర గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని స్థానిక సర్పంచ్  ధరావత్ సుజాత రాజశేఖర్ అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో గ్రామాన్ని గత పాలకులు పాలించిన ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అని అన్నారు . గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామ ప్రజలు గ్రామానికి ఉన్న   మంచినీటి సమస్య , మురికి కాలువలు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ తదితర సమస్యలుతెలిపారు . నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని  ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు   నమ్మి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించారు.  మాట ప్రకారమే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో గ్రామంలో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్లు లింకు రోడ్లునిర్మాణ పనులు చేపట్టమని, ఐదు లక్షల వ్యయo మురికి కాలువల డ్రైనేజీనిర్మాణం పనులు చేపట్టామని,  వంటి ఒక్కొక్కటిగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి రాకపోకులకు రోడ్లు ,అద్వానంగా మారాయని , నూతనంగా నీటి పైపుల నిర్మాణం చేయించాలని, అదేవిధంగా ఆగిపోయిన నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను చేపట్టాలనిచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామంలోని నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. సిద్ధిసముద్ర గ్రామాన్ని తీర్చి దిద్దడానికి రాజకీయాల పార్టీల అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ఆదర్శవంతంగా తీర్చు దిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333