యాపర్ల లో  సమాగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 

Nov 11, 2024 - 18:05
Nov 11, 2024 - 18:32
 0  0
యాపర్ల లో  సమాగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 
యాపర్ల లో  సమాగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 

తెలంగాణ వార్త:- తెలంగాణ వ్యాప్తంగా సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ కుల సమాగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 6న  మొదలైంది..ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లు అంటించి న అధికారులు..వారికి కేటాయించిన ఇండ్లకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు,ఎన్యు  మారేటర్లలో ప్రైమరీ స్కూల్ టీచర్లు,నాన్ టీచింగ్ సిబ్బంది ఎక్కువగా ఉండడంతో, ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సర్వే చేస్తున్నారు.సెలవు రోజుల్లో ఉదయం కూడా కుల గణన సర్వే చేస్తున్నారు,వివిధ వర్గాల ప్రజల సామాజిక,ఆర్థిక, రాజకీయ,పరిస్థితులను,  ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా  నమోదు చేస్తున్నారు,ఏ ఇంటికి ఎప్పుడు ఎన్యూ మారేటర్ వస్తారని విషయం ముందుగానే తెలియజేస్తున్నారు.దీంతో ఆయా కుటుంబాలకు సంబంధించిన పెద్దలు లేదా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు  సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని యాపర్ల ఎన్యమారేటర్ మురళీకృష్ణ తెలిపారు ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం చేస్తారు? అని దగ్గర నుంచి కులం,ఉప కులం,భూమి,సంపాదన,గొర్రెలు,బర్రెలు,అప్పులు, ఆదాయం,రాజకీయ పోస్టుల్లో,ఉన్నారా? ఏమైనా పదవుల్లో పని చేశారా? అని ప్రశ్నలకు సమాధానాలు సేకరించి,ఆ వివరాలన్నిటిని ఫామ్ లో నమోదు చేస్తున్నారు.అందరి ఆధార్ కార్డు నెంబర్లు, తీసుకుంటున్నారు.కుల గణన సర్వే ఫామ్ లో పార్ట్-1లో  యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు,సంబంధించి,58 ప్రశ్నలు,పార్ట్ బి లో  కుటుంబ వివరాలు సంబంధించి,17ప్రశ్నలు ఉంటాయి అధికారులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333