మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏవో నాగేశ్వరరావు
తిరుమలగిరి 21 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఏవో నాగేశ్వరరావు మొక్కజొన్న తేమ శాతాన్ని మరియు తాలు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ తిరుమలగిరి మండలంలో 350 ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేయడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో 1500 ల ఎకరాలు పంటను వేసినారు రైతులందరూ మొక్కజొన్నను మార్కెట్ లో కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర 2400 రూపాయలు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ వెంకటరెడ్డి పి ఎస్ సి ఎస్ విజయకృష్ణారెడ్డి ఇంచార్జి చెరుకు మల్లేష్ మరియు రైతులు పాల్గొన్నారు....