ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

Apr 21, 2026 - 03:47
 0  16
ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

  తిరుమలగిరి 21 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ జ్యోతిరావు పూలే చౌరస్తాలో మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలు బలిజ సంఘం అధ్యక్షులు ఆరని సోమరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి   పూలాభిషేకం చేశారు అదేవిధంగా బసవేశ్వరుని యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పారు వారు 12వ శతాబ్దంలోనే కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో సంపన్న జాతులను మమేకం చేశారని కొనియాడారు ఈరోజు వారి జయంతిని స్ఫూర్తి తీసుకొని మనం అందరం పాటించవలసిన బాధ్యతను గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో తిరుమలగిరి మండల మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లన్న , తిరుమలగిరి మండల మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఎల్సోజు దీన్దాయల్ , బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుకూరి బాబు, బీసీ సంఘం తన్నీరు రాంప్రభూ , మెడబోయిన యాదగిరి, కామ్రేడ్ కడెం లింగన్న, రజక సంఘం నాయకులు పులిమామిడి సోమన్న, బీసీ సంఘం నాయకులు చేను శ్రీనివాస్, పులిమామిడి బిక్షం, స్వాతి రవి ,వంగరి బ్రహ్మం పద్మశాలి సంఘం నాయకులు చింతకింది మురళి తదితరులు ముఖ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి