జోగులాంబ గద్వాల జిల్లాను సందర్శించిన స్టేట్ సీజనల్ వ్యాధుల మానిటరింగ్ అధికారి

Jul 17, 2025 - 19:40
 0  22
జోగులాంబ గద్వాల జిల్లాను సందర్శించిన స్టేట్ సీజనల్ వ్యాధుల మానిటరింగ్ అధికారి
జోగులాంబ గద్వాల జిల్లాను సందర్శించిన స్టేట్ సీజనల్ వ్యాధుల మానిటరింగ్ అధికారి

 జోగులాంబ గద్వాల 17 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల  జిల్లాను స్టేట్ సీజనల్ వ్యాధుల మనిటరింగ్ అధికారి డా. సుధాకర్ లాల్  జిల్లా కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డా. S. K. సిద్దప్ప తో మరియు జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, జిల్లా లోని  పీహెచ్సిసి  మెడికల్ ఆఫీసర్లు మరియు  సూపర్ వైజర్లు తో జిల్లా లోని సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా చీకున్ గున్య మొ: వాటి పైన రివ్యూవ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. పై వ్యాధులు రాకుండ ముందస్తు గా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధులు వచ్చిన ప్రాంతాలలో జిల్లా ర్యాపిడ్ రెస్పాండ్ టీమ్ లు  పీహెచ్ సి  ర్యాపిడ్ రెస్పాండ్ టీమ్ లు సందర్శించి  యాంటీ లార్వాల్ మేజర్స్ మరియు యాంటీ మలేరియా మేజర్స్ జరిపించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం ప్రతి గ్రామం లో జరగాలని గత సంవత్సరము డెంగీ వ్యాధులు వచ్చిన ప్రాంతాలు మరియు హైరిస్క్ గ్రామాలను గుర్తించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధులపై అవగాహనా కలిగించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము లో  NCD PO. Dr. Sandya Kiranmai,NCVBDC PO. Dr. G. Raju, DIO. Dr. Rizwana,MHN PO. Dr. Prasoona Rani. PHC's Medical officer's, Dy. Demo. K. మధుసూదన్ రెడ్డి,SUO. B.Sivanna, DVLM Narendrababu, DPHNO T. Varalaxmi,DDM రామాంజనేయులు NCD జిల్లా కోర్డినేటర్ K. శ్యాంసుందర్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333