మేడేను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్కెవి నియోజకవర్గ అధ్యక్షుడు గౌడ్ చర్ల సత్యనారాయణ

తుంగతుర్తి, ఏప్రిల్ 30 : మేడే ఉత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌడ్ చర్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్మిక సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.కార్మిక, కర్షకుల హక్కుల సాధన కోసం పోరాడిన రోజు మేడే అన్నారు.ప్రపంచ కార్మిక దినోత్సవం గా మేడే ను రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కర్షకులు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు ప్రతి గ్రామంలో హాజరై జెండాలను ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించాలని, కార్మికులకు, కర్షకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. మేడే సందర్బంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ గారి సహకారం తో మండలంలోని భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ తుంగతుర్తి మండల అధ్యక్షులు గడ్డం సోమేశ్ మండల ఉపాధ్యక్షలు కూరపాటి సోమేశ్ జాజుగల్ల అంబేద్కర్ పోలేపాక సురేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.