మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు

తెలంగాణ వార్త ప్రతినిధి :- మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
నెమ్మది వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా కార్యదర్శి
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక కోదాడ పట్టణం సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా కోదాడ పట్టణ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయక పోగా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటు వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో వారి పేరు నమోదు చేయకుండా ఏ విధంగా పనిచేసుకుంటున్నారని ఆరు నెలలుగా వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం మున్సిపల్ అధికారులు మున్సిపల్ పాలకవర్గం వారి గురించి పట్టించుకునే పరిస్థితులు లేరని వారన్నారు. ఓట్లప్పుడు మున్సిపల్ కార్మికులు గుర్తొస్తారు కానీ కనీస వేతనాలు అమలు విషయంలో నాయకులకు కార్మికులు గుర్తురారని వారన్నారు తక్షణ మున్సిపల్ అధికారులు పాలకవర్గం వారి సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే రోజు వారు కార్యక్రమాలు చేసి మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని వారన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కోటగిరి వెంకటనారాయణ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు దాసరి శ్రీనివాస్ కార్మికులు బుచ్చారావు వినోద్ సైదమ్మ వెంకటేశ్వర్లు శివ వినోద్ ఎల్లమ్మ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు
*అనంతరం మున్సిపల్ కార్మికులు 110 సిఐటియులో చేరడం జరిగింది*