ఇందిరమ్మ రాజ్యంలోనే ఇంటి నిర్మాణాలు.
తెలంగాణ సారధి కళాకారుల ఆట పాటలకు జనం జేజేలు.
జోగులాంబ గద్వాల 6 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: కేటి దొడ్డి. మండలం ప్రజా పాలనా కళా యాత్ర లో భాగంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశాల మేరకు డీపీఆర్ఒ అరిఫ్ ఉద్దీన్ సారథ్యంలో సాంస్కృతిక సారధి కళాకారుల జిల్లా అధ్యక్షులు రాహుల్ నేతృత్వంలో ప్రభుత్వ పథకాల పాటలతో గంగన్ పల్లి,గువ్వలదీన్నే,ఇర్కిచెడు తండాల లో పాటలతో జనాలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పాటలకు జనాలు చప్పట్లు కొడుతూ ప్రజా విజయోత్సవ పాటలను తిలకించారు జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రభుత్వ కళాకారుల పాటలకు జనాలు జేజేలు పలుకుతున్నారు. రేపటి తో 19 రోజుల ప్రజాపాలన కళా యాత్ర విజయవంతగా పూర్తి కానుంది.
ఈ కార్యక్రమం లో ప్రజలు గ్రామ పెద్దలు కళాకారులు కేశవులు, భూపతి, హాజరాత్, కృష్ణ ,కవిత స్వామి ,రమాదేవి పాల్గొన్నారు.